LIVE : నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రెస్మీట్ - Malkajgiri MP Etela Rajender Live - MALKAJGIRI MP ETELA RAJENDER LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2024/640-480-21897569-thumbnail-16x9-mp-etela-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 8, 2024, 3:24 PM IST
|Updated : Jul 8, 2024, 3:37 PM IST
Malkajgiri MP Etela Rajender Press Meet : కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పాలనపై లేదని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిని జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంపై మాట్లాడిన ఆయన, రాజ్యాంగ విరుద్ధంగా ఇతర పార్టీ కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం వల్లే సమావేశంలో గందరగోళం నెలకొందన్నారు. జీహెచ్‌ఎంసీలో ఆ పార్టీకి మెజారిటీ లేకపోయినా, ఇతర పార్టీల్లో గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను చేర్చుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పనులను సాధించే దిశగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలగాలని ఈటల కోరారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయమని జనం చాటిచెప్పారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందని, రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
Last Updated : Jul 8, 2024, 3:37 PM IST