LIVE : తెలంగాణ భవన్లో పూలే జయంతి వేడుకలు - phule jayanti celebrations - PHULE JAYANTI CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 11:38 AM IST
|Updated : Apr 11, 2024, 11:49 AM IST
Mahatma Jyotiba Phule Jayanti Celebrations in Telangana Bhavan : మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పూలే జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.1827వ సంవత్సరం ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిబా పూలే, అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. దిగువ కులాల ప్రజలకు సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేశారు. ఈయన భార్య సావిత్ర బాయి పూలే కూడా మహిళా విద్యకు పెద్దపీట వేశారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసిన భారతీయులుగా వీరు గుర్తింపు సాధించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లోనే వేడుకలను నిర్వహించుకుంటున్నారు.
Last Updated : Apr 11, 2024, 11:49 AM IST