మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పేలిన సిలిండర్లు, కాసేపు గందరగోళం - Gas Cylinder Fire Accident at PS
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 10:43 PM IST
Madhapur Police Station Fire Accident : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గుడి వద్ద బాణాసంచా కాల్చారు. ఆ నిప్పు రవ్వలు ఎగిరి స్టేషన్లో సీజ్ చేసిన సామగ్రిపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లకు కూడా మంటలు వ్యాపించడంతో భారీ శబ్దాలతో అవి పేలిపోయాయి(Fire Accident). దీంతో స్టేషన్లో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీసారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Gas Cylinder Fire Accident in Madhapur : ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీజ్ చేసిన సామగ్రిలో ప్లాస్టిక్, గ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అయితే మంటలు ఒక్కసారిగా భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నవారు, స్థానికులు, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.