ఆదివాసీపై దాడి అనంతబాబు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం - లోకేశ్ ఫైర్ - Lokesh Fire on MLC Ananthbabu - LOKESH FIRE ON MLC ANANTHBABU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 3:23 PM IST
Lokesh Fire on MLC Ananthbabu in Vijayawada : పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన నేరానికి ఆదివాసీలపై వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుడు అనంతబాబు దాడిని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. గన్‌మెన్‌తో దాడి చేయించి మరోసారి రాక్షస ప్రవృత్తి చాటుకున్నారని ధ్వజమెత్తారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా ఆయనకు బుద్ది రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Ananthbabu Gunmen Attack on Tribal : ఎస్సీ (SC), ఎస్టీ (ST) లపై దమనకాండ సాగిస్తున్న అనంతబాబుతో పాటు అతడ్ని పెంచి పోషిస్తున్న తాడేపల్లి ప్యాలెస్‌ను బద్ధలు కొట్టేందుకు 5 కోట్లమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తించాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఆత్మబంధువు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.