అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన గుడ్లు - వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - Rotten Eggs Distribute To Anganwadi - ROTTEN EGGS DISTRIBUTE TO ANGANWADI
🎬 Watch Now: Feature Video


Published : Jun 21, 2024, 1:22 PM IST
Rotten Eggs Distributed To Anganwadi : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం అనార్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన గుడ్లు సరఫరా చేశారని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయి, నాణ్యత లేనివిగా ఉండటంతో పాటు చాలా చిన్నవిగా ఉండటంతో గ్రామస్థులు అడ్డుకొని వాటిని తిరిగి పంపించారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి గుడ్లను సరఫరా చేయడంతో స్థానికులు హెచ్చరించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
పాడైన గుడ్లను తింటే పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలకు పెట్టే సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా అధికారులకు, మహిళా శిశు సంక్షేమ అధికారులకు విన్నవించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదని వాపోతున్నారు. సరఫరా చేసిన సరుకులను ఇలాగే పిల్లలకు తినిపిస్తే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుచున్నారు.