LIVE : బీఆర్ఎస్ నేతల చలో మేడిగడ్డ పర్యటన - ప్రత్యక్షప్రసారం - చలో మేడిగడ్డ
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 5:12 PM IST
|Updated : Mar 1, 2024, 7:58 PM IST
BRS Chalo Medigadda Tour Live : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోయాల్సిందేనని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేసీఆర్ మినహా మేడిగడ్డకు మిగతా 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించటానికి బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలోని పియర్స్ కొన్ని కుంగాయి. అన్నారం ఆనకట్టలోనూ సీపేజీ సమస్య ఉత్పన్నమైంది. దీంతో రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదిలి రెండు ఆనకట్టలని ఖాళీ చేశారు. ఆనకట్టలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని ఎన్డీఎస్ఏతో పాటు నిపుణులు చెప్పారని, మేడిగడ్డ, అన్నారంలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. రాష్ట్రప్రభుత్వ వాదనతో భారత రాష్ట్ర సమితి విభేదిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టలో కొన్ని పియర్స్ మాత్రమే కుంగాయని, ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును విఫలమైనదిగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయాల్సింది పోయి ఆనకట్ట మొత్తం కొట్టుకుపోవాలన్న కుట్ర పూరిత వైఖరితో వ్యవహరిస్తోందని అంటోంది. దీనిపై అన్నారం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Last Updated : Mar 1, 2024, 7:58 PM IST