LIVE : "రైతు కోసం - జంగ్ సైరన్" పేరుతో బండి సంజయ్ రైతు దీక్ష - BANDI SANJAY RYTHU DEEKSHA - BANDI SANJAY RYTHU DEEKSHA
🎬 Watch Now: Feature Video
Published : Apr 2, 2024, 11:10 AM IST
|Updated : Apr 2, 2024, 2:34 PM IST
Bandi Sanjay Protest Dharna to Support Farmers : అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మొద్దు నిద్రలో ఉన్న సర్కార్‌ను మేల్కొల్పడానికి, రైతులకు భరోసా కల్పించడానికి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం వద్ద రైతు దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతు కోసం - జంగ్ సైరన్ పేరుతో దీక్ష చేస్తున్న బండి, ఉదయం 10-00 గం.ల నుంచి మధ్యాహ్నం 2-00 గం.వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్ వద్ద ‘రైతు దీక్ష’కు పోలీసుల అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి రైతాంగ సమస్యలపై కొట్లాడటంతో పాటు అన్నదాతలకు అండగా ఉన్నది బీజేపీనేనని చెప్పారు. కేసీఆర్ సర్కార్ వరి వేస్తే ఉరి అని, రైతులను గోస పెడితే ముందుండి కొట్లాడింది కమలం పార్టీ అని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ బీఆర్‌ఎస్ విధానాలనే ఆచరిస్తుందని ధ్వజమెత్తారు. సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. రైతుల కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, క్షమాపణ చెప్పిన తర్వాతనే కరీంనగర్‌లో అడుగుపెట్టాలన్నారు.
Last Updated : Apr 2, 2024, 2:34 PM IST