శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉద్ధృతి - రేపు సాగర్ గేట్ల ఎత్తివేత - Lifting of 10 Gates of Srisailam - LIFTING OF 10 GATES OF SRISAILAM
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 12:56 PM IST
Lifting of 10 Gates of Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నప్పుడు ఆ ప్రవాహ ఉద్ధృతికి డ్యాం ముందు భారీ గొయ్యి ఏర్పడింది. దీనినే ప్లంజ్‌పూల్ అని కూడా అంటారు. గొయ్యిని పూడ్చకపోతే ప్రాజెక్టుకు ప్రమాదం అని నీటిపారుదల అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు నాగార్జున సాగర్‌లో కూడా నీటిమట్టం పెరగడంతో రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు.