స్కూల్లో చిరుత కలకలం- వాచ్మెన్ తలపై దాడి- చివరకు ఏమైందంటే? - Leopard Entered In School - LEOPARD ENTERED IN SCHOOL
🎬 Watch Now: Feature Video


Published : Jun 15, 2024, 12:45 PM IST
Leopard Entered In School Viral Video : తమిళనాడులోని తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో చిరుతపులి కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చిరుత పులి ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. పాఠశాల వాచ్మెన్ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ పక్కనే ఉన్న కార్ సర్వీస్ సెంటర్లోకి వెళ్లింది.
అక్కడున్న కొంతమంది యువకులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఓ కారులో ఎక్కి ఇరుక్కున్నారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించారు. గాయపడిన వాచ్‌మెన్‌ను తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా కలెక్టర్ దర్పకరాజ్, ఎస్పీ అల్బర్ట్ జాన్, చిరుతకు మత్తుమందు ఇచ్చేందుకు 20మంది అటవీ శాఖ సిబ్బందిని పిలిపించారు. ఈ ఆపరేషన్‌లో 50మందిపైగా పోలీసులు పాల్గొన్నారు. చివరకు చిరుతను అధికారులు బంధించారు.