మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ - వృథాగా తాగునీరు - Leakage of Mission Bhagiratha - LEAKAGE OF MISSION BHAGIRATHA
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 4:36 PM IST
Leakage of Mission Bhagiratha : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలవనరులు పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడుతోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటడంతో తాగునీటి సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి నీరు సరఫరా చేస్తోంది. మరోవైపు పలు ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్‌లైన్‌లలో పలు చోట్ల లీకేజీలు ఏర్పడుతున్నాయి. నిర్వహణలోపమో లేదా ఆకతాయిల పనో తెలియదు కానీ తరచుగా లీకేజీలు చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం లింగంపేట గ్రామ శివారులో మిషన్ భగీరథ పైపులైను లీకేజీకి గురైంది. ఎంతో విలువైన మిషన్ భగీరథ నేలపాలవుతోంది. సుమారు రెండు గంటలపాటు లీకేజీతో సమీపంలోని పంట పొలాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నీటి లీకేజీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని వేడుకుంటున్నారు.