LIVE : కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ - ప్రత్యక్షప్రసారం - ktr participate Kukatpally live
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20656721-thumbnail-16x9-ktr-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 3, 2024, 12:49 PM IST
|Updated : Feb 3, 2024, 1:04 PM IST
KTR Live : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే, రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక్కడ హామీలు అమలయ్యేది లేదని విమర్శించారు. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ను గెలిపించాలని అన్నారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని, రెండు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా రైతుల రుణమాఫీ మాత్రం జరగలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలుసని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి, ఆరున్నర లక్షల మంది రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.