LIVE : మల్కాజిగిరిలో కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్​ మీటింగ్​ - KTR Meeting Live - KTR MEETING LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 8:05 PM IST

Updated : Apr 29, 2024, 8:27 PM IST

KTR Meeting with social Media Warriors Live : లోక్​సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నేరుగా జనాల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ఒక్కసారిగా సమ్మర్​ హీట్​ కంటే రాజకీయ హీట్​ను పెంచేశారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోడ్​షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరిలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్​తో​ సమావేశం నిర్వహించారు. బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణుల్లో నూతనుత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్​ఎస్​ పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసారి తెలంగాణ గొంతుకై బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పనిసరిగా బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు.
Last Updated : Apr 29, 2024, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.