LIVE : ముస్తాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ - KTR Meeting with BRS Workers Live
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-03-2024/640-480-20910446-thumbnail-16x9-ktr.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 5, 2024, 2:04 PM IST
|Updated : Mar 5, 2024, 2:19 PM IST
KTR Live From Sircilla : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తరచూ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలను వారికి వివరిస్తున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.
Last Updated : Mar 5, 2024, 2:19 PM IST