షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపు బీఆర్‌ఎస్ ధర్నా : కేటీఆర్‌ - BRS Calls Dharna For Loan Waiver

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 4:44 PM IST

KTR Calls for Dharnas For Loan Waiver : రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టంచేశారు. అర్థ సత్యాలు, అబద్ధాలతో అన్నదాతల్ని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని వివరించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే 40 శాతం మందికే రుణమాఫీ చేశారని కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరనసగా గురువారం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని కేటీఆర్​ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేపడతామని కేటీఆర్‌ ప్రకటించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.