గుంటూరులో రోశయ్య విగ్రహం ఏర్పాటు - అడ్డుకున్న అధికారులు - Konijeti Rosaiah Statue
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 11:44 AM IST
Konijeti Rosaiah Statue Controversy in Guntur District : మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహం ఏర్పాటుకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం పొందినప్పటికీ అధికారులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. నగరంలో రోశయ్య విగ్రహ ఏర్పాటుకు ఆర్య వైశ్య సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పనులను అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డుగా నిలబడి పనులు ఆపివేశారు. ఓ ఉద్యోగి అయితే ఏకంగా గుంతలో కూర్చున్నారు. అధికారుల వైఖరి నిరసిస్తూ ఆర్య సంఘాలు ఆందోళనకు దిగారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెడితే లేని ఇబ్బంది రోశయ్య విగ్రహానికి వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలో మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో ఇటీవల వైఎస్ సహా పలువురి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అనుమతులు లేకున్నా మంత్రి రజిని వాటిని ఆవిష్కరించారు. అప్పుడు మౌనంగా ఉన్న అధికారులు రోశయ్య విగ్రహం ఏర్పాటును మాత్రం అడ్డుకోవడం సరికాదని ఆర్య వైశ్య సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.