కోల్‌కతా హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన- కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళి - Medical Students Rally in AP - MEDICAL STUDENTS RALLY IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 8:35 AM IST
Kolkata Rape Incident Doctors Protest in AP: కోల్‌కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది రోడ్డెక్కారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిరసన శిబిరం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్‌లో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైద్యులపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని స్థాయిల్లోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్ నుంచి మెయిన్ బజార్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో మెడికోలు కొవ్వొత్తులు పట్టుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కడప అంబేడ్కర్ కూడలి వద్ద మహిళా సమైక్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. అత్యాచారం చేసిన నిందితులను ఇప్పటివరకు శిక్షించలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.