విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్‌రెడ్డి - Kishan Comment INDIA Alliance
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/640-480-20619612-thumbnail-16x9-kishan-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 29, 2024, 8:08 PM IST
Kishan Reddy on Self Help Groups : ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, స్వయం సహాయక సంఘాలను మరింతగా విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎస్‌హెచ్‌జీలకు కేంద్రం ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే ఆయా సంఘాలకు రూ.20 లక్షలు అప్పు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీని చెల్లించాలని కాని గత ప్రభుత్వ నిధులు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన శక్తి వందన మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Kishan Reddy on Parliament Elections 2024 : ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి అన్నారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు నలుగురు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్‌కు చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే డీఎన్ఏకు చెందిన పార్టీలని ఆరోపించారు.