LIVE : కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - kishan reddy pressmeet live - KISHAN REDDY PRESSMEET LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-04-2024/640-480-21153190-thumbnail-16x9-kishan-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 5, 2024, 3:48 PM IST
|Updated : Apr 5, 2024, 3:56 PM IST
Kishan Reddy Live : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలందరూ మోదీ మార్కు చూసి, కమలంకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన అంశమని, ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తి స్వేచ్ఛను హరించారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశభద్రతకు వాడాల్సిన టెక్నాలజీని, వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం దారుణమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వాడిన బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని ఆయన ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. ఫోన్ ట్యాపింగ్ సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని ఆయన పునరుద్హాటించారు.
Last Updated : Apr 5, 2024, 3:56 PM IST