దొంగల ఆట కట్టించిన తల్లీకూతుళ్లను సత్కరించిన కిషన్రెడ్డి - కేంద్రం తరపున ప్రశంసాపత్రం అందజేత - WOMEN FIGHT WITH THIEVES IN HYD - WOMEN FIGHT WITH THIEVES IN HYD
🎬 Watch Now: Feature Video
Published : Mar 23, 2024, 5:24 PM IST
G Kishan Reddy Felicitates To Brave women : బేగంపేటలో దోపిడీకి వచ్చిన దుండగులను చాకచక్యంగా తరిమేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ కాలనీలో జరిగిన దోపిడీయత్నం ఘటనలో తల్లీకూతుళ్లు చూపిన ధైర్య సాహసాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఈ ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమిత, భవిలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాలను అందజేశారు.
తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన దొంగలను అడ్డుకొని వారిని ప్రతిఘటించి పోరాడిన తల్లీకూతుళ్లు మహిళలకు ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి మహిళ విపత్కర సమయాల్లో ఆత్మ రక్షణ నిమిత్తం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలను నేర్చుకోవాలని అన్నారు. నారీశక్తి సత్తా ఏంటో తల్లీ కూతుళ్లు నిరూపించారని ఆయన అన్నారు. విద్యార్థినులకు చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ఇద్దరి తల్లీకూతుళ్లకు ప్రశంసా పత్రాలను అందించి సన్మానించడం జరిగిందని తెలియజేశారు.