తెలంగాణ ఏపీల్లో ఏ రాష్ట్రం పట్ల మాకు వివక్ష లేదు : కిషన్ రెడ్డి - kishan reddy about BJP New Government - KISHAN REDDY ABOUT BJP NEW GOVERNMENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 10, 2024, 2:41 PM IST
Kishan Reddy on BJP New Government : 2047లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం పట్ల తమకు వివక్ష లేదని స్పష్టం చేశారు. దేశంలో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పెంచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Kishan Reddy about PM Modi : ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధాని మోదీ నేతలతో దేశాభివృద్ధి కోసం ఏం చేయాలో సమీక్షించారని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలనే దృక్పథంతో నేతలందరికీ ప్రధాని దిశానిర్దేశం చేశారని చెప్పారు. దానికి అనుగుణంగా అయిదు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, తమ కూటమివి నైతిక విలువలతో కూడిన ఒప్పందాలని స్పష్టం చేశారు.