ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధం - లంబోదరుడిని తీసుకెళ్లే టస్కర్ వచ్చేసిందిగా - Khairatabad Ganesh Taskar
🎬 Watch Now: Feature Video
Khairatabad Ganesh Shobha Yatra Taskar : ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర మొదలు గంగమ్మ దరికి జాగ్రత్త చేర్చేది టస్కరే. దాదాపు పదహారేళ్లుగా మచిలీపట్నానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ టస్కరే అత్యంత జాగ్రత్తగా గణపయ్యను ట్యాంక్ బండ్ వద్దకు చేరుస్తోంది. నిమజ్జనానికి ముందు రోజే ఈ టస్కర్ ఖైరతాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం మహా గణపతి శోభాయాత్ర కోసం టస్కర్ వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. దీనికోసం వర్కర్లు కష్టపడుతున్నారు.
40 టన్నుల ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఆ తరువాత దాదాపుగా రెండు గంటలు వెల్డింగ్ పనులు కొనసాగుతాయి. సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలించే విధంగా ప్రణాళిక సిద్దం చేశామని అధికారులు వివరించారు. మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.