LIVE : ఖైరతాబాద్ గణేశ్‌ కర్రపూజ - ప్రత్యక్షప్రసారం - Khairatabad Ganesh Karra Puja - KHAIRATABAD GANESH KARRA PUJA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 5:08 PM IST

Updated : Jun 17, 2024, 5:20 PM IST

Khairatabad Ganesh Live : వినాయక చవితి అనగానే తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి. ఇక్కడి మహాగణపతి వరల్డ్ ఫేమస్. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన, ఎంతో విశిష్టమైన గణపయ్య ఇక్కడ ప్రతి ఏటా కొలువవుతాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ రానుంది. గణేశ్ నవరాత్రుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటాం. ముఖ్యంగా హైదరాబాద్​లో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడి లంబోదరుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొలువయ్యే ఖైరతాబాద్‌ గణపతి విగ్రహ తయారీ పనులను ఇవాళ ప్రారంభిస్తున్నారు. వినాయకుడి తయారీ పనులను నిర్జల ఏకాదశి రోజు అయిన ఈరోజు సాయంత్రం కర్రపూజతో ప్రారంభించారు. ఈ పూజకు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ ఏడాది మరింత ఘనంగా ఖైరతాబాద్​ గణేశుడి ఉత్సవాలు జరుపుతామని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.
Last Updated : Jun 17, 2024, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.