కేజీబీవీలో వంట మనుషులుగా మారిన విద్యార్థినులు - సిబ్బంది ఉన్నా వీళ్లు చేసుకోవాల్సిందే! - వంట చేస్తున్న కేజీబీవీ విద్యార్థులు
🎬 Watch Now: Feature Video
Published : Feb 16, 2024, 1:54 PM IST
KGBV Students Cooking at Hostel : విద్యాలయం వంటశాలగా మారింది. విద్యార్థినులు కార్మికుల అవతారమెత్తారు. పిల్లలకు వండి పెట్టాల్సిన సిబ్బంది పత్తాలేకుండా పోయారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి కేజీబీవీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొన్ని రోజులుగా వారే వంట చేసుకుంటున్నారు. వంట కార్మికులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, వంట పని నుంచి వడ్డించే దాకా అన్ని పనులూ విద్యార్థులే చేసుకుంటున్నారు.
Sitarampalli KGBV Students Cooking Viral Video : కేజీబీవీ(KGBV) నుంచి బయటికొచ్చిన ఈ దృశ్యాలు స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. బాలికల అవస్థలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందించలేదని పలువురు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రిన్సిపల్ తీరుతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. చదువుల కోసం వెళ్లిన పిల్లలను వంట మనుషులుగా మార్చారని, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు.