LIVE : బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో - KCR BUS Yatra In Miryalaguda - KCR BUS YATRA IN MIRYALAGUDA
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 12:39 PM IST
|Updated : Apr 24, 2024, 9:39 PM IST
KCR BUS Yatra In Miryalaguda LIVE : లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ఇవాళ్టి నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. బస్సుయాత్ర ద్వారా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మిర్యాలగూడ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. నల్గొండ నుంచి కేసీఆర్ బస్సుయాత్ర మిర్యాల గూడ చేరుకుంది. అక్కడ రోడ్ షో అనంతరం... సూర్యాపేటకు చేరుకున్నారు. రోడ్ షోలో భాగంగా ఉదయం సాగుదారుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. 17 రోజుల పాటు జరగనున్న బస్సుయాత్ర, అదీ వేసవి కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Last Updated : Apr 24, 2024, 9:39 PM IST