కేసీఆర్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం - సడెన్ బ్రేక్ వేయడంతో ఒకదాన్నొకటి ఢీకొన్న కార్లు - KCR Convoy Small Accident - KCR CONVOY SMALL ACCIDENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/640-480-21306485-thumbnail-16x9-car.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 24, 2024, 8:37 PM IST
KCR Convoy Hits another Vehicles : నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ బస్ యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ బయలుదేరిన మాజీ సీఎం, నల్గొండ జిల్లా మడుగులపల్లి వద్ద టీ తాగడానికి విడిది హోటల్ వద్ద కాసేపు ఆగారు. తరువాత మిర్యాలగూడకి బయలుదేరారు. కేసీఆర్ ఉన్న వాహనం ముందు వెళ్లడంతో కాన్వాయ్ వేగంగా వెళ్లింది. ఈ క్రమంలో ముందు ఉన్న కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న 8 కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
సుమారు ఐదు కార్లు ముందు భాగాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ఉద్ధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మిర్యాలగూడ నుంచి మొదలైన గులాబీ అధినేత యాత్ర వచ్చేనెల 10న సిద్దిపేటలో ముగియనుంది.