బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధన బలం ఉంటే, మాకు ప్రజా బలం ఉంది : కాసాని జ్ఞానేశ్వర్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 28, 2024, 3:08 PM IST
Kasani Gnaneshwar Interview : పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తాను చేసిన పనులు చూసి ఓటు వేయాలని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే, తనకు ప్రజలపై ప్రేమ ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారన్నారు. కరెంటు, నీళ్లు, రైతు బీమా, రైతు బంధు హామీలను కాంగ్రెస్ మరిచిందని మండిపడ్డారు. ఈ కారణాల వల్ల ప్రజలకు బీఆర్ఎస్పై సానుకూల దృక్పథం ఉందని వివరించారు. దీంతో వీలైనంత వరకు పబ్లిక్ మీటింగ్స్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండు అధికార పార్టీలను ఎదుర్కోవడం చాలా సునాయసం అని ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆయన ధీమా వ్యక్తం చేశారు.