రాజకీయ ఒత్తిళ్లపై ఐకమత్యంతో పోరాటం చేస్తాం : కాపు, బలిజ, తెలగ సంఘాల జేఏసీ - Kapu Employees JAC Meeting
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-02-2024/640-480-20665370-thumbnail-16x9-kapu-balija-telaga-employees-jac-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 5:38 PM IST
Kapu Balija Telaga Employees JAC Meeting: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాపు, బలిజ, తెలగ ఉద్యోగులను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకే గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసినట్లు కాపు, బలిజ, తెలగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సమావేశం ఎటువంటి రాజకీయ సమావేశం కాదని వారు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు హోదాల్లో పనిచేస్తున్న అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నేతలు వెల్లడించారు. వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లపై ఐకమత్యంతో ఉండి పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని వివరించారు. విడిపోయిన వారందర్ని ఏకం చేసేందుకు ఈ ఐకాసను వారథిగా మలుచుకుంటామని నేతలు పేర్కొన్నారు.