ETV Bharat / state

విజయవాడలో భూగర్భ మెట్రో స్టేషన్ - కీలక ప్రాంతాల్లో భూసేకరణ - VIJAYAWADA METRO RAIL PROJECT

మెట్రో రైలులో రెండు కారిడార్లు - తొలి దశలో ఎన్టీఆర్‌ పరిధిలో 20 కృష్ణాలో 14 స్టేషన్లు

Vijayawada Metro Rail project
Vijayawada Metro Rail project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 1:43 PM IST

Vijayawada Metro Rail project : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో, విజయవాడ నగరంలో భూసేకరణకు అంచనాలు సిద్ధం చేశారు. ఏ ప్రాంతంలో ఎంత భూమి అవసరం అనేది ఖరారు చేశారు.

విజయవాడలో మెట్రో రైలు పరుగులు తీసేలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు కోసం ఏ ప్రాంతంలో ఎంత భూమి అవసరమనే అంచనాలను అధికారులు రూపొందించారు. మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లున్నాయి. పీఎన్‌బీఎస్‌ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్ కాగా, పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్‌గా తొలిదశలో మెట్రో నిర్మాణం జరగనుంది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూమి అవసరమనేది రెవెన్యూ అధికారులు గుర్తించారు. వార్డు, సర్వే నంబర్ల వారీగా తేల్చారు. నగరంలోని పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదలతో పాటు విజయవాడ గ్రామీణ మండలంలోని ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడులో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం భూసేకరణ చేయనున్నారు.

'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'

Vijayawada Metro Rail project
Vijayawada Metro Rail project (ETV Bharat)

పీఎన్‌బీఎస్‌-గన్నవరం కారిడార్ 26 కి.మీ, పీఎన్‌బీఎస్‌-పెనమలూరు కారిడార్ 12.5 కి.మీటర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారుగా 91 ఎకరాలు సేకరించనున్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.11వేల కోట్లు కాగా, భూసేకరణ వ్యయం రూ.1,152 కోట్లు అని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అంచనా వేశారు. ఈ రెండు కారిడార్లలో 34 ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 20 స్టేషన్లు, కృష్ణా జిల్లా పరిధిలో 14స్టేషన్లు ఉన్నాయి. ఇందుకు గాను రెండు జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి మెట్రో కార్పొరేషన్‌ నివేదికలు సమర్పించింది.

విజయవాడ నగరంలో 4.12 ఎకరాలు

మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం విజయవాడ నగర పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో 4.12 ఎకరాల భూమి సేకరించనున్నారు. ఇందులో 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లోని 31కి పైగా సర్వే నంబర్ల పరిధిలో భూమి సేకరించనున్నారు. బందరు, ఏలూరు రోడ్లను ఆనుకుని 12చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల మధ్యలోనే ఎక్కువ ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. విజయవాడ గ్రామీణ మండలంలోని ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడులో కలిపి మొత్తం 1.28 ఎకరాల భూ సేకరణకు కసరత్తు మొదలైంది.

ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు

మెట్రో ప్రాజెక్టు తొలి దశ నిర్మాణంలో మొత్తం 34 స్టేషన్లు నిర్మించనుండగా ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.25 కోట్ల వరకూ అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో 3కిలోమీటర్లు మెట్రోలైన్‌ నిర్మించనుండగా ఇక్కడే ఒక మెట్రో స్టేషన్‌ కూడా ఉంటుంది. విజయవాడ, గ్రామీణ మండలంలో మినహా ఎక్కువ శాతం కృష్ణా జిల్లా పరిధిలోనే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. గన్నవరం సమీపంలోనే మెట్రో కోచ్‌ డిపో నిర్మాణం కోసం 50 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం తీస్తున్నారు! - కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.