శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - జ్ఞానప్రసూనాంబికా దేవి కైలాసగిరి ప్రదక్షిణ - Giri Pradakshina in srikalahasti

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 8:40 PM IST

Kailasa Giri Pradakshina in tirupati : శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులుగా బయలుదేరిన ఆదిదంపతులు 23 కిలోమీటర్లు ఉన్న కైలాసగిరి (Kailasa Giri) ప్రదక్షిణ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu)  అతిథులుగా హాజరైన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ నిర్వహించే గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Maha Shivaratri Brahmotsavalu in Srikalahasti : దేవతామూర్తులకు అడుగడుగునా స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి (Maha Shivaratri) వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భగా  గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామి, అమ్మవారులను ఆలయానికి తీసుకువెళ్లి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రజలు భక్తి, శ్రద్దలతో దైవ దర్శనం చేసుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.