రోడ్లపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు నిరసన సెగ - YOUTH PROTEST AGAINST JUKKAL MLA - YOUTH PROTEST AGAINST JUKKAL MLA
🎬 Watch Now: Feature Video
Published : Aug 5, 2024, 4:32 PM IST
Youth Protest Against MLA Thota Lakshmi Kantha Rao : కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వాహనాన్ని యువకులు అడ్డుకున్నారు. జుక్కల్ మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ని యువకులు అడ్డుకున్నారు. జుక్కల్ మండల కేంద్రంలో రోడ్లు బాగు చేయాలని యువకులు డిమాండ్ చేశారు. చాలా సంవత్సరాలు గడుస్తున్న రోడ్లు అధ్వాన్నంగా మారినా ఎవరు పట్టించుకోవడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు బాగు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో యువకులు ఆందోళన విరమించుకున్నారు. రోడ్లపై వినతిపత్రం ఇవ్వాలని యువకులను ఎమ్మెల్యే కోరారు. తన క్యాంప్ కార్యాలయానికి యువకులు వచ్చి మాట్లాడాలని వారికి సూచించారు. స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో చెట్లను నాటడమే కాకుండా శానిటేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.