ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుస్తుంది: జేసీ దివాకర్‌రెడ్డి - tdp janasena alliance
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 8:16 PM IST
JC Diwakar Reddy Comments: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక బాగుందని పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం మొదటి జాబితా చూసి వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందని ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతుందని దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన వివరించారు. మంచి అభ్యర్థులను ప్రకటించారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మంచి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాక్షస పాలన పోవాలనే లక్ష్యంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఆత్మీయులను కూడా పక్కనపెట్టి టికెట్ల పంపిణీ చేస్తున్నారని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే బీజేపీతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వైసీపీకి డబ్బు, తమకు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని అన్నారు. జగన్ సభలకు వస్తున్న జనం 500 కిలోమీటర్ల దూరం నుంచి అభిమానంతో రావడంలేదని మందు, చికెన్, డబ్బు ఇస్తే వస్తున్నారని ఆయన విమర్శించారు.