ETV Bharat / offbeat

మీరు ఏ స్టైల్లో వండుతున్నారు - తేడా వస్తే అనారోగ్యం పొంచి ఉందట! - THE BEST COOKING METHODS

డీప్‌ ఫ్రై, ఎయిర్‌ ఫ్రైయింగ్, గ్రిల్లింగ్​తో సమస్యలు - వంట పద్ధతులు తెలుసకోకపోతే అనారోగ్యమే!

The Best Cooking Methods
The Best Cooking Methods (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 3:52 PM IST

The Best Cooking Methods : ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడమే కాదు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓ పద్ధతి ప్రకారం వంట చేస్తేనే ఆహార పదార్థాల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ, చాలామంది తెలిసీ, తెలియక రుచి కోసం విభిన్న పద్ధతుల్లో వంటలు ట్రై చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ పదార్థాల్లోని పోషకాలు నశిస్తాయి. శరీరానికి సమపాళ్లలో అందకపోవడంతో పాటు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. తెలిసీ, తెలియని వంట పద్ధతులు వివిధ రకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తెలిసీ, తెలియని కొత్త పద్ధతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిపుణులు సూచించిన ఆ కుకింగ్‌ పద్ధతులేంటో తెలుసుకుందామా?

మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!

డీప్‌ ఫ్రై

చాలా మందికి వేపుళ్లు ఇష్టం. అదే పనిగా వేపుడు తయారు చేస్తుంటే నూనె ఆక్సిడైజ్‌ చెంది ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెడు కొవ్వులు కావడం వల్ల తరచూ ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోతాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అలాగే భవిష్యత్తులో ఊబకాయం బారిన పడే అవకాశాలూ ఎక్కువేనంటున్నారు.

వేపుళ్లు

చాలామందికి భోజనంలో ఏదో ఒక వేపుడు ఉండాల్సిందే. అలాగని కాయగూరల్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫ్రై చేసే క్రమంలో అక్రిలమైడ్ అనే రసాయనం ఉత్పత్తి జరుగుతుంది. ఇది భవిష్యత్తులో క్యాన్సర్‌ కారకంగా మారే ప్రమాదం ఉంటుందని, రోస్టింగ్‌, బేకింగ్‌ పద్ధతుల్లో తయారుచేసే పదార్థాలతోనూ ఈ ముప్పు తప్పదని నిపుణులు చెప్తున్నారు.

THE BEST COOKING METHODS
THE BEST COOKING METHODS (ETV Bharat)

గ్రిల్లింగ్

ఎలాంటి నూనె వాడకుండా పదార్థాల్ని గ్రిల్‌ చేసుకొని తింటున్నామనుకుంటారు కొంతమంది! కానీ, అది కాయగూరలు, పండ్లు వంటి కొన్ని పదార్ధాలకు మాత్రమే వర్తిస్తుందని నిపుణులు చెప్తున్న మాట. మాంసాహారాన్ని గ్రిల్ పద్ధతిలో ఉడికిస్తే 'హెటరో సైక్లిక్' అమైన్స్ వెలువడతాయట. సహజసిద్ధంగానే కార్సినోజెనిక్‌ స్వభావాన్ని కలిగి ఉండే ఈ రసాయనాలు క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయంటున్నారు.

స్మోకింగ్

కొన్ని వంటలు పూర్తయ్యాక పొగ వేస్తుంటారు. పొగ అదనపు రుచిని అందిస్తుందనేది ఈ కుకింగ్‌ పద్ధతి ముఖ్యోద్దేశం. కానీ, పొగ ధూమపానం చేసినంత హాని కలిగిస్తుందట. కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు వెలువడి క్యాన్సర్​కు దారి తీస్తాయంటున్నారు నిపుణులు.

రుచికరమైన హెల్తీ సొరకాయ దోశ - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!

THE BEST COOKING METHODS
THE BEST COOKING METHODS (ETV Bharat)

మైక్రోవేవింగ్

మైక్రో ఓవెన్లో పదార్థాల్ని వండుకోవడం, వేడి చేసుకోవడం చేస్తుంటారు. అయితే, ఓవెన్​లో విడుదలయ్యే రేడియేషన్‌ వల్ల బ్రెయిన్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)’ చెబుతోంది.

ఎయిర్‌ ఫ్రైయింగ్

తక్కువ నూనె లేదా అస్సలు నూనె లేకుండా పదార్థాల్ని వేయించుకోవడానికి కొంతమంది 'ఎయిర్‌ ఫ్రైయింగ్‌' పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ మేరకు ఎయిర్‌ ఫ్రైయర్స్‌ మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అయితే, ఈ పద్ధతిలో వచ్చే వేడి గాలి ఆరోగ్యానికి హాని కలిగించే పలు రకాల రసాయనాల్ని ఉత్పత్తి చేస్తుందట. పైగా ఆయా పదార్థాలు సరిగ్గా ఉడక్క పచ్చిపచ్చిగా తినాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వంట పద్ధతుల్లో ఇది ఆరోగ్యకరమైనదే అయినా తరచూ ఈ పద్ధతి సరికాదంటున్నారు.

THE BEST COOKING METHODS
THE BEST COOKING METHODS (ETV Bharat)

నాన్‌స్టిక్

ప్రస్తుతం చాలామంది నాన్​స్టిక్ అనే మాట వాడుతున్నారు. ఇలాంటి వంట పాత్రల్లో టెఫ్లాన్‌ కోటింగ్‌ అధిక ఉష్ణోగ్రత వల్ల కరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఇవి ఆరోగ్యకరం!

  • అనారోగ్యం కొని తెచ్చుకునే బదులు సంప్రదాయ పద్ధతుల్ని పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆవిరిపై ఉడికించిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నూనె అవసరం లేకుండా తయారు చేయడంతో పాటు చెడు కొవ్వుల్ని తొలగించడానికి ఆవిరి ఉపయోగపడుతుంది.
  • నూనె, బటర్‌ అవసరం లేకుండా స్టాక్,బ్రాత్ వంటి రుచికరమైన సూప్స్‌లో పదార్థాల్ని ఉడికించడాన్ని పోచింగ్‌ పద్ధతి అంటారు. వంట పద్ధతుల్లో ఇది కూడా ఆరోగ్యకరమే.
  • అధిక ఉష్ణోగ్రతల్లో కాకుండా సహజ సిద్ధంగా స్టౌపై సిమ్‌లో పెట్టి ఉడికిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఆలివ్‌, క్యానోలా నూనెల్ని వంట కోసం వాడడం ఆరోగ్యకరం.
  • వంటకాల్లో ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌, కృత్రిమ రంగుల్ని తగ్గించడం ఆరోగ్యానికి మంచిది.
  • స్టీలు, సెరామిక్‌, మట్టి వంటి మెటీరియల్స్‌తో తయారుచేసిన వంట పాత్రలు ఎంచుకుంటే మంచిది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'దహీ ఇడ్లీ' సింపుల్ టిప్స్​తో ఇలా ట్రై చేయండి - ఒక్కటి కూడా వదలరు

మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.