పవన్​కల్యాణ్​ విజయం - కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమైన వీర మహిళలు - JANASENA WOMENS - JANASENA WOMENS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 1:46 PM IST

Janasena Women Visit to Kanakadurga Temple : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఆ పార్టీ వీర మహిళలు కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. మంగళగిరి నియోజకవర్గ వీర మహిళలు, యువకులు ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలిస్తే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని వీర మహిళలు మొక్కుకున్నారు. 

Pawan Kalyan Win in Pithapuram: దీంతో ఆయన ఎన్నికల్లో 70 వేలకు పైగా మెజారిటీతో గెలవడంతో ఆదివారం వీర మహిళలు అమ్మవారికి సారే సమర్పించి 101 కొబ్బరికాయలు కొట్టనున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కల్యాణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మహిళలు ఆకాంక్షించారు. ఆయనకు అమ్మవారి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని పార్టీ నేతలు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్​ కల్యాణ్ ఎన్నికల్లో 70వేలకు పైగా మెజార్టీతో​ గెలుపొందారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.