ప్రశాంత ప్రాంతంలో చిచ్చు పెడుతున్నారు : జనసేన నాయకులు

🎬 Watch Now: Feature Video

thumbnail

Janasena Flexi Controversy in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లులోని రామలింగ కాంప్లెక్స్​ వద్ద జనసేన నాయకులు ఏర్పాటు చేసిన " మేము సిద్ధం " అనే ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఎవరో పని కట్టుకొని మరీ చించి వేశారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను స్థానిక జనసేన పార్టీ సమస్వయ కర్త వాసగిరి మణికంఠ తీవ్రంగా ఖండించారు.

Guntakal : ఒక ఫ్లెక్సీని చించివేస్తే దాని స్థానంలో పది ఫ్లెక్సీలు వెలుస్తాయని మణికంఠ పేర్కొన్నారు. ఈ చర్యతో మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు ఉంటే నేరుగా తేల్చకోవాలే గాని ఇలా ఫ్లెక్సీని చించివేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఎవరో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని కోరారు. ఫ్లెక్సీని చించిన వారు ఎవరో తమకు తెలియజేయాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.