LIVE: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan Nomination

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 12:22 PM IST

Updated : Apr 23, 2024, 7:36 PM IST

thumbnail
Janasena Party Chief Pawan Kalyan Nomination With a Huge Rally Live At Pithapuram : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, భాజపా శ్రేణులతో భారీ జనసందోహం నడుమ జనసేనాని ర్యాలీ కొనసాగుతోంది. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది.నామినేషన్‌ ర్యాలీలో భారీగా అభిమానులు : అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్న పవన్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్‌ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్‌ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగసభలో పవన్‌ పాల్గొంటారు.ప్రస్తుతం నసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Apr 23, 2024, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.