నీటిలో యోగా ఎప్పుడైనా చూశారా? - అయితే ఇప్పుడు చూసేయండి - aqua Yoga in jagtial

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:29 PM IST

thumbnail
నీటిలో యోగా ఎప్పుడైనా చూశారా అయితే ఇప్పుడు చూసేయండి (ETV Bharat)

Aqua Yoga in Jagtial : యోగాసనాలు అందరిలా కాకుండా నీటిలో వేస్తూ అబ్బురపరుస్తున్నాడు జగిత్యాలకు చెందిన ఓ సైకాలజిస్ట్‌. 24 ఏళ్లుగా మెట్‌పల్లిలో సిద్ధ సమాధి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి సైకాలజిస్ట్ డాక్టర్‌ రాజా రత్నాకర్ శిక్షణ ఇస్తున్నాడు. నీటిలోనే శవాసనం, తాడాసనం,  సూర్య నమస్కారాసనం,  పద్మాసనం,  వృక్షాసనం,  మకరసనం, ఇలా వివిధ రకాల ముద్రాసనాలు నేర్పిస్తున్నాడు.యోగా ద్వారా అనేక రుగ్మతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని యోగ గురువు రాజరత్నాకర్‌ అన్నారు. యువకులు, విద్యార్థులు జలయోగపై ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నారు. సాఫ్ట్​వేర్ పనుల్లో ఒత్తిడి నుంచి బయటకు రావడానికి జలయోగ ఒక మంచి సాధనం అని శిక్షణకు వచ్చినవారు చెబుతున్నారు. జలయోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని అంటున్నారు. పూర్వం మునులు, ఋషులు మాత్రమే జలయోగ చేసేవాళ్లు కానీ, రాజ రత్నాకర్ సహకారంతో జలయోగ నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నామని శిక్షణ పొందినవారు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.