జడ్చర్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన - దుందుభి వాగులో సరదాగా ఈతకొట్టిన అనిరుధ్‌రెడ్డి - Jadcharla MLA swim in the canal - JADCHARLA MLA SWIM IN THE CANAL
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 10:48 AM IST
Jadcharla MLA Swim in Dhundubi Canal : వాయుగుండం ప్రభావంతో మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జడ్చర్లలో దాదాపుగా అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం దుందుభి వాగును పరిశీలించారు. వాగులో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాసేపు ఈత కొట్టారు.
అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్‌జోన్‌లో ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ప్లాట్లను సైతం రద్దు చేయాలని సూచించారు. దీంతో పాటు జడ్చర్లలోని వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపారు.