పెట్టుబడులు ఆకర్షించేందుకు త్వరలో నూతన పారిశ్రామిక విధానం : మంత్రి శ్రీధర్ బాబు - Sridhar Babu On Industrial Policy - SRIDHAR BABU ON INDUSTRIAL POLICY
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 4:07 PM IST
Minister Sridhar Babu On Industrial Policy : రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యువ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా కొత్త విధానాలు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. 'ఇండో గ్లోబల్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల' కార్యక్రమంలో శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన పారిశ్రామికవేత్తలకు అవార్డులను అందజేశారు.
ఐటీ, ఫార్మా, పౌల్ట్రీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సహించేందుకు కొత్త పాలసీలను తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోవు పదేళ్ల కాలంలో పరిశ్రమలకు సంబంధించి హైదరాబాద్ ప్రధాన నగరంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.