ఏపీ జీవనాడైన పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం విధ్వసం చేసింది: మంత్రి నిమ్మల - Irrigation Minister Rama Naidu - IRRIGATION MINISTER RAMA NAIDU

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 7:49 PM IST

Irrigation Minister Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం విధ్వసం చేసిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఐదేళ్లలో జగన్‌ పూర్తి చేసింది 2శాతమైతే నాశనం చేసిందని వందశాతమని ఆరోపించారు. తర్వలోనే అన్ని శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని నిమ్మల రామానాయుడు చెప్పారు. జగన్ అసమర్థతతో కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని మంత్రి వెల్లడించారు.

సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం ప్రాజెక్టు సందర్శనే ఉంటుందని రామానాయుడు స్పష్టం చేశారు. అది ఎప్పటిలోగా అనేది సీఎం నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తిచేసి చంద్రబాబు లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని ఆయన తెలిపారు. జలవనరుల శాఖ సమర్థంగా నిర్వర్తించి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. ఆవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రూ. 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా ఆవులుపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. ఈ శాఖకు అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్​కు రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.