"ఆ రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా అన్న మాటే, ఇక్కడి వరకు వచ్చింది"- కుమారి ఆంటీతో ముఖాముఖి
🎬 Watch Now: Feature Video
Interview of Kumari Aunty : కుమారి ఆంటి, ఇప్పడు భాగ్యనగరంలో పరిచయం అక్కర్లేని పేరు. కేబుల్ బ్రిడ్జి దగ్గర్లో రోడ్డు పక్కన చిన్న హోటల్ స్టాల్‌ను నిర్వహిస్తున్న కుమారి ఆంటికి ఎంతలా క్రేజ్ వచ్చిందంటే, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమె హోటల్ స్టాల్‌కు అండగా నిలిచారు. ఆమె చదువుకున్నది 4వ తరగతే కానీ జీవితపు బడిలో పాఠాలు మాత్రం బాగా నేర్చుకుంది. 12 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి నెలకు 300 రూపాయల అద్దె గుడిసెలో నివాసం ఉండేది. అయితేనేం ఆత్మ విశ్వాసం మాత్రం మెండు, బతుకుదెరువు కోసం ఆమె బట్టలు కుడితే భర్త ఆటో నడిపేవాడు.
Hyderabad Kumari Aunty : తాను నేర్చుకున్న వంటలతో చిన్న ఫుడ్ స్టాల్ పెట్టిన ఆమె నేడు నెలకు లక్షన్నరకుపైగా ఆదాయం గడిస్తున్నారు. కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆమె వంట కోసం జనాలు క్యూ కట్టి మరీ ఎదురు చూస్తున్నారిప్పుడు. ట్రాఫిక్ జాం వల్ల పోలీసులు ఆ ఫుడ్ స్టాల్ తొలగించమని చెప్పారు. ఏ మీడియా వల్ల తాను పాపులర్ అయ్యానో దానివల్లే తనకు కష్టాలూ వచ్చాయన్నారు కుమారి ఆంటి. చివరికి సీఎం కార్యాలయం జోక్యంతో ఫుడ్ స్టాల్ కొనసాగిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తన చేతి వంటకు అంతా అభిమానులే అంటున్నారు కుమారి.