రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హర్‌ఘర్ తిరంగా - జాతీయ జెండాతో విద్యార్థుల ప్రదర్శనలు - Har Ghar Tiranga Rally
🎬 Watch Now: Feature Video
Har Ghar Tiranga in Telangana : 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సహా అనుబంధ సంఘాల శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో పాఠశాల విద్యార్థులతో కలిసి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు స్వతంత్య్ర కాలం నాటి పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వేసిన నాటికలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని 5కే రన్ నిర్వహించారు. చంద్రయణగుట్ట నుంచి చార్మినార్ వరకు సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో భారీ తీరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఆర్‌పీఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. 3 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి పాఠశాలలో విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో నినాదాలు చేశారు.