సొంత జిల్లాకు నిధులు కేటాయించలేని ముఖ్యమంత్రి : టీడీపీ నేత గోవర్దన్ రెడ్డి - Railway Line in YSR District
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 9:31 PM IST
Incomplete Kadapa Bangalore Railway Line in YSR District : కడప-బెంగుళూరు రైల్వేలైన్ పనులు ఎప్పటికీ పూర్తయితాయో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప - బెంగుళూరు రైల్వే లైన్ పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే కడప నుంచి పెండ్లి మర్రి వరకు రైల్వే పనులు పూర్తయ్యాయి. ఆయన మరణించిన తరవాత రైల్వే లైన్ పనులు ఆగిపోయాయి.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అయిదేళ్లు అవుతున్న తన తండ్రి ప్రారంభించిన పనులను పూర్తి చేయాలేక పోయారని గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కడప - బెంగుళూరు రైల్వే పనులు పూర్తి అయితే ప్రజలకు వృథా ప్రయాస తగ్గుతుందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను బెంగుళూరుకి ఎగుమతి చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించ వచ్చని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా కోసం ఒక బటన్ నొక్కితే వైఎస్సార్ జిల్లా వాసుల కలను సాకారం అవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి కడప బెంగుళూరు రైల్వే లైన్ను పూర్తి చేయవలసిందిగా కోరుకున్నారు.