'రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండండి' - Imd Officer Interview - IMD OFFICER INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Aug 16, 2024, 7:40 PM IST
IMD Officer Shravani Interview : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు మొహం చాటేసిన వరుణుడు, గురువారం నుంచి మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పట్టణ ప్రజలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పల్లెల్లో మాత్రం అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్రంలో ఇవాళ, రేపు మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాతావరణం, శీతోష్ణస్థితిలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఒక్క ప్రాంతంలో భారీ వర్షం ఉంటే, మరో ప్రాంతంలో వర్షం ఉండటం లేదని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. గత వారం రోజులుగా ఉక్కపోత ఎక్కువగా ఉందని, రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.