అప్పుడే భగ్గుమంటున్న భానుడు - ఫిబ్రవరి నుంచే సూర్యప్రతాపం మొదలైంది
🎬 Watch Now: Feature Video
IMD Officer Sravani Face2Face about Temperature : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి తొలివారం నుంచి ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
Heavy Temperature in Telangana : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే ఎండల ప్రభావం ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి పేర్కొన్నారు. ద్రోణి ఒకటి ఏర్పడిందని దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో 36 నుంచి 37 మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ముఖాముఖి.