తెలంగాణకు తలమానికం ఐఐటీహెచ్ - ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చిన మోదీ - governer on IIT Hyderabad Campus
🎬 Watch Now: Feature Video
Published : Feb 20, 2024, 10:32 PM IST
IIT Hyderabad Campus Dedicated to the Nation by Modi : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి ప్రధాని మోదీ(Prime Minister Shri Narendra Modi) తెలంగాణ రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. (I.I.T )హైదరాబాద్‌లోని అభివృద్ధి ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేయగా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తయారైన వెంటిలేటర్లు కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడాయని కొనియాడారు.
IIT Hyderabad Campus : నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించగా ఎంపీ ధర్మపురి అర్వింద్ , ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మహబూబ్ నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రధాన మంత్రి శిక్ష ఉచ్చతర్ అభియాన్ కార్యక్రమాన్ని జమ్ము నుంచే ప్రారంభించారు. ఇందుకోసం పాలమూరు యూనివర్శిటీకి కేంద్ర ప్రభుత్వం 100కోట్లు కేటాయించింది.