ప్రజారవాణా వ్యవస్థలో మెట్రోరైలు ప్రాజెక్టు చారిత్రాత్మకం : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి - Metro MD On Metro Rail New Record - METRO MD ON METRO RAIL NEW RECORD
🎬 Watch Now: Feature Video


Published : May 3, 2024, 8:20 PM IST
Metro MD On Metro Rail New Record : తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తరుచూ మెట్రోలో ప్రయాణించే వారి కోసం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. 'గ్రీన్మైల్స్ లాయల్టీ క్లబ్ పథకాన్ని' హైదరాబాద్లోని అమీర్పేట మెట్రోస్టేషన్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజా రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు చారిత్రకమన్న ఎన్వీఎస్ రెడ్డి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నేడు 50 కోట్లకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం గర్వంగా ఉందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెట్రో రెండో దశ డీపీఆర్లకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోద ముద్ర పడనున్నట్లుగా వెల్లడించారు. సురక్షితమైన, విశ్వసనీయమైన ప్రయాణానికి నగరవాసులు మెట్రో రైలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రోరైలు వల్ల 14 కోట్ల 50లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసినట్లుగా వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన 'గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్' ద్వారా ప్రయాణికులు నిర్దేశించిన ట్రిప్పులు పూర్తి చేసి ఉచిత బహుమతులు, అదనపు ట్రిప్పులు, మర్చండైజ్ పొందవచ్చని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.