ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం - యంత్రాలు, పుస్తకాలు దగ్ధం - హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Jan 24, 2024, 1:41 PM IST
Hyderabad Fire Accident : హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యాత్రలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్యాలయంలో పని చేసే సిబ్బంది గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపులోకి తీసుకువచ్చారు.
Fire Accident at Govt Book Printing Office : అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయి. విద్యుదాఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. తెల్లవారు జామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఉద్యోగులు, కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రాణ నష్టం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.