ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన హైదరాబాద్ సీపీ - ఏమన్నారంటే? - Hyderabad CP on PhoneTapping Case - HYDERABAD CP ON PHONETAPPING CASE
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 3:31 PM IST
Hyderabad CP on PhoneTapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ పాతబస్తీ ఈద్గా వద్ద సీపీ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు. కేసు విచారణ వేగంగా జరుగుతోందని, దర్యాప్తు సక్రమ పద్ధతిలో సాగుతోందని చెప్పారు. రాజకీయ నేతలకు ఏమైనా నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పడు అన్ని వివరాలు చెబుతానని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Another Case on Former EX DCP Radhakishan Rao : మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో రూ.కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల పేర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.