హైదరాబాద్లో భారీ వర్షం - నిండుకుండులా హుస్సేన్ సాగర్ - 4 గేట్లు తెరిచి నీటివిడుదల - HUSSAIN SAGAR GATES OPENED - HUSSAIN SAGAR GATES OPENED
🎬 Watch Now: Feature Video
Published : Aug 20, 2024, 12:16 PM IST
HUSSAIN SAGAR GATES OPEN: హైదరాబాద్ నగర వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురవడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మరోవైపు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో హుస్సేన్ సాగర్ నాలుగు తూము గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిగా నిండడంతో జలకళను సంతరించుకుంది.
సాగర్ గేట్లు తెరవడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155313కి ఫోన్ చేయాలని జలమండలి సూచించింది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలకు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే జలమండలి సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.