వలకు చిక్కిన 1500 కిలోల చేప - ఈ వెరైటీ ఫిష్ వీడియో చూశారా?​ - HUGE FISH CAUGHT IN AP VIDEO VIRAL - HUGE FISH CAUGHT IN AP VIDEO VIRAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 11:14 AM IST

Huge Fish Caught in AP Video : ఇది చూసేందుకు తిమింగలం పరిమాణంలో తెల్లటి మచ్చలతో కనిపిస్తున్న దీనిపేరు టేకు చేప. టన్నున్నర బరువున్న ఈ చేపను చూసేవాళ్లు అమ్మో ఇంతపెద్ద చేపా అంటున్నారు. మరి ఇంతపెద్ద చేప మత్స్యకారుల వేటలో దొరికిందంటే నమ్ముతారా అని అడిగితే అవుననే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్​లో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం గిలకలదిండిలో వేటకువెళ్లిన మత్స్యకారుల వలకు ఈ టేకు చేప చిక్కిందని చెప్తున్నారు. దీంతో మత్స్యకారులు వెంటనే క్రేన్ సాయంతో భారీ టేకుచేపను బయటకు తీశారు.

Huge Teku Fish in Machilipatnam Viral Video : మచిలీపట్నం నుంచి చెన్నై కేంద్రంగా ఈ టేకు చేపను కొందరు వ్యాపారులు కొనుగోలు చేశారు. చేపల కోసం వేటకువెళ్లిన మత్స్యకారుల సైతం ఈ టేకు చేపను చూసి ఆసక్తిగా తిలకించారు. టన్నున్నర బరువున్న ఈ టేకు చేపను క్రేన్​ సాయంతో మత్స్యకారులు బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.